Book Description
అన్నివేళలా ఖూనీలే కానక్కర్లేదు. దొమ్మీలే జరగక్కర్లేదు. ఒళ్ళు జలదరించే భయానక ఘట్టాలే ఉండక్కర్లేదు. కొన్ని రకాల నేరాలు, నేరాల నేపధ్యంలో సంభవించే కొన్ని కొన్ని ఘటనలు తమాషాగా ఉంటాయి. గూండాల తండాలు విచ్చుకత్తులు విసురుకుంటున్న చోట ఊహించని వైపు నుంచి మానవత్వం తళుక్కుమనవచ్చు. అతి సామాన్యమైన మనిషే ఒకానొక ఘట్టంలో మహోదాత్తంగా ప్రవర్తించవచ్చు. అద్భుతమైన పరిశోధన అనుకున్నది కాస్తా తుస్సుమనవచ్చు. రొటీన్ దర్యాప్తు అనుకున్నది ఊహించని మలుపులు తిరగవచ్చు. ఇలాంటి (యదార్థ) ఘటనలను ఆసక్తికరమైన కథనంతో ‘‘ఖాకీ కలం’’ అందిస్తుంది. పోలీసు వృత్తిలో తన అనుభవాలను రంగరించి ఉత్కంఠను రేకెత్తించే కథలుగా మలచి సమర్పిస్తున్న శ్రీ రావులపాటి సీతారాంరావు సుప్రసిద్ధ కథా రచయిత. తెలుగులోని అనేక వార, మాస పత్రికల్లో ఆయన కథలు ప్రచురితమయ్యాయి. ఈ సంపుటిలోని కథలు ఆంధప్రభ (ఆదివారం)లో ధారావాహికంగా ప్రచురించబడి, అశేష పాఠకుల విశేష అభిమానాన్ని అందుకున్నవే!