Book Description
ఈ రాంపా వున్నాడే- మహా గడుగ్గాయ్! ఒక దాంట్లో వేలు పెట్టి ఊరుకోడు కదా! ‘వేలు’ సంపాదిస్తున్నానా? ఖర్చు పెడుతున్నానా? అని చూసుకోడు. అన్నింటా ప్రవేశమే! వట్టి ప్రవేశమేనా? ప్రావీణ్యం కూడాను. తన్ని చూసి కుళ్లుకునే వాళ్లుంటే ఉండొచ్చుగాక! కానీ కనిపించే ‘కుళ్లు’ను కడిగి పారేయాలనేదే తన సంకల్పం! కార్టూన్ల ఛర్నాకోల విసిరినా, కథల కొరడా ఝళిపించినా, నటకరవాలా లెత్తినా.. అంతెందుకు? కలమెత్తినా, గళమెత్తినా - మొత్తానికి ‘మెత్త’గా వుంటూనే, వ్యవస్థను మొత్తేచోట మొత్తుతుంటాడు. మంచి ఎక్కడున్నా పైకెత్తుతుంటాడు. మగవలూ మగవాళ్లూ తెలుగువాళ్లకే కాదు తెలుగు తెలిసిన వాళ్లకూ చదివే అలవాటు లేనివాళ్లకు ఎన్నిసార్లు చదివినా ఓ సరదా స్నేహితుడితో మాట్లాడుతున్న అనుభూతి!