Book Description
పత్ర హరితం! పత్ర భరితం! ఆకులు లేని చెట్టునీ ఊహించలేం. చెట్లు లేని ప్రకృతినీ ఊహించలేం. అది మానవజన్మేలేని మానవత్వంలా వుంటుంది. బాలకన్నయ్యను వటపత్రశాయిని చేసింది. పత్ర పాత్ర లేని పాత్ర లేదన్నట్లుగా - తోరణాలై అలంకరిస్తుంది.. తాంబూలం అందిస్తుంది. ఆకుపూజలు చేయిస్తుంది.. విస్తరై అన్నం తినిపిస్తుంది. ఏ ఆకులో ఏ ప్రయోజనం దాక్కుందో చెప్పే ప్రయత్నం కాదు ఈ పుస్తకం. అతివల చీర కుచ్చిళ్ళపై, అంచులపై, కరవస్త్రాలపై ఒక చోట అనేయటం... ఏ ఒక్కటీ యింకొకదానిని ప్రతి కాకుండా గీసిన పత్ర చిత్రమాలిక యిది. శతపత్ర వందనాలతో..