Book Description
మనసులో ఎటువంటి భావాలున్నా, పైకి మైత్రి నటిస్తూ, సరైన సమయం రాగానే వెన్నుపోటు పొడవటంలోనే రాజకీయ చతురత ఉంటుంది. ఆరంభం నుంచీ నానాసాహెబ్ కౌటిల్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. ఓ వంక బ్రిటిష్ వారి అడుగులకు మడుగులొత్తుతూ, మరోవైపు వారి గోతులు తవ్వే పథకాలు వేస్తూ వచ్చాడు. బ్రిటీష్‍వారు నానాను ఎంతగా నమ్మారంటే, సిపాయిలు అతడికి అధికారం కట్టబెట్టిన తరువాత కూడా, ‘నానా ద్రోహం’, విషయంలో బ్రిటీష్వఆరిలో ఏకాభిప్రాయం కుదరలేదు అంటేనే గ్రహించవచ్చు నానా ఎంత గొప్ప చాతుర్యాన్ని ప్రదర్శించాడో! అతడు అమాయకుడని సాక్ష్యం చెప్పిన వారినీ బ్రిటీష్‍వారు సంపూర్ణంగా నమ్మలేదు. నానాయే స్వాతంత్య్ర సంగ్రామ పథక నిర్మాత అని చెప్పిన వారి సాక్ష్యాన్ని నమ్మలేకపోయారు. కానీ జీవితాంతం నానా పేరు చెప్తనే ఉలిక్కిపడుతూ, భయపడుతూ గడిపారు.