Book Description
చరిత్ర రచనలలో ప్రేమగాథలకు ఉన్న ప్రాధాన్యం ఇతర గాధలకు లేదు. అందుకే జహనార, రజియా సుల్తాన్, అనార్కలి వంటి గాథలు విస్త•త ప్రచారం పొందాయి. కానీ అనేక నిబంధనలు, నియమాల అడుగున నలిగి ప్రేమరాహిత్య భావనతో సతమతమై ప్రేమకోసం తపించిన రోషనార దుష్ట పాత్ర అయింది. అసలు గాథ ప్రచారానికి రాలేదు. అందుకే రోషనార రచనలో కేవలం రోషనార పాత్రనేకాక షాజహాన్, జహనార, ఔరంగజేబు వంటి పాత్రల వ్యక్తిత్వ విశ్లేషణనూ నవల నిడివి పరిమిత పరిధిల ప్రాధాన్యాన్నిస్తూ నవల రచన కొనసాగింది. నవల రచనలో అవసరమైన సందర్భాలలో కల్పనలు చేసినా ఆ కల్పనలు కూడా నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా జరిగినవి. నవల ప్రచురితమైన తరువాత పాఠకుల నుంచి వచ్చిన స్పందన అపూర్వమైనది. తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ కథలు, హారర్ కథలతో పాటుగా చారిత్రక రచనలు లేని లోటు, వాటికి ఉన్న పాఠకాదరణ స్పష్టం చేసిందీ స్పందన.