Book Description
మానవ సమాజం ఎప్పుడూ ఏకవర్ణమయం కాదు. సప్తవర్ణ సమ్మిశ్రితం. ఒకే విషయంపై పలు భిన్నమైన ఆలోచనలుంటాయి. పరస్పర విరుద్ధమైన దృక్కులు వుంటాయి. ఈ పలు విభిన్నమైన ఆలోచనలు, దృక్కోణాలు పరిశీలించి వాటిల్లోంచి తమకు నచ్చిన ఆలోచనను ఎన్నుకునే వీలు సామాన్య ప్రజలకుండటమే ప్రజాస్వ్యామం. అంతేకానీ, అందరికీ ఒకేరకమైన దృక్కోణం వుండాలని, అందరం ఒకేరకంగా ఆలోచించాలని, తమ ఆలోచనను సమర్థించని వారు శత్రువులని భావించి, ఇతర ఆలోచనలన్నిటినీ అణచివేయాలని ప్రయత్నించటం అమానవీయం. రాక్షసత్వం. అలాంటి రాక్షసత్వం ఉక్కుపాదం క్రింద నలుగుతూ ఒకే దృక్కోణం, ఒకే ఆలోచనలు ప్రదర్శిస్తేనే రచయితగా మనగలిగే తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని ఆలోచన విధానాన్ని ప్రదర్శించే కథల సంకలనం ‘రామకథాసుధ’