Book Description
జ్ఞానులు ఒకే స్థలంలో స్థిరంగా ఉండక జ్ఞాన సముపార్జన కోసం నిరంతరం సంచరిస్తూ ఉండాలి. లోక సంచారి కానివాడు జ్ఞాని కాలేడు. జ్ఞాని అనేవాడు లోక సంచారి కాకతప్పదు. ఆదిభిక్షువు శివుడు జంగమ దేవరగా ఈ స్థావర జంగమాత్మక ప్రపంచంలో నిరంతరం సంచరించినవాడే. సిద్ధార్ధుడు బుద్దుడిగా పరివర్తన చెంది, పరివ్రాజికుడిగా పర్యటించినవాడే. ఆది శంకరుడు మొదలుకొని వివేకానందుడి దాకా ఎందరెందరో సాధువులు, సన్యాసులు, సంత్‍లు, సూఫీ ఫకీర్లు ఆసేతు హిమాచలం సంచరించిన వారే. మహమ్మద్ ప్రవక్త, జీసస్ కూడా ఆ కోవకు చెందినవారే. సంచరించటం ఆసియా దేశవాసుల పురాతన సంప్రదాయం. అతి ప్రాచీన సంస్క•తి. పూర్వకాలంలో ‘‘దేశాటనం’’ విద్యాభ్యాసం చివరలో ఒక ముఖ్యమైన భాగం. 10 రోజులలో 1943 కి.మీలు స్కూటర్‍పై పర్యటించిన ఛత్తీస్‍ఘడ్ సాహసయాత్రా కధనం.