Book Description
‘‘సరే మీ చదువు పాడుచేసుకోవద్దు. నాతో మాట్లాడుతారే, ఆ సమయాన్ని నేను మా స్నేహితురాలికోసం కేటాయిస్తాను. మరి అప్పుడు మాట్లాడతారా ఆమెతో?’’ కరుణ అడిగింది. ఆంతర్యాల సంబంధాల విషయంలో ఉచితానుతాలు ఏమిటో, దాని ఆదర్శమేమిటో సామాన్యులకంటే అధికంగానే కుంజకు తెలుసును. తల్లి మనసు కించపడుతుందేమోనన్న ఉద్దేశంతో ఆదిలో వివాహమే వద్దన్నాడు. ఇప్పుడు కరుణను దృష్టిలో వుంచుకొని తన హృదయంలో మరొక స్త్రీకి స్థానం కల్పించడానికి అతనికి సుతరామూ ఇష్టంలేదు. ‘ఇన్న రోజులనుంచి ఇంట్లో వుంటే కుంజ ఒక్క పర్యాయం కూడా నన్ను చూడటానికి ప్రయత్నించలేదు. ఇంత నిర్లక్ష్యం దేనికో? నేనేమైనా జడపదార్ధాన్నా? స్త్రీని కాదా నేను? నన్ను ఒక్కసారి మాట్లాడించి వుంటే చున్నీకి, నాకూ ఎంత వ్యత్యాసం వున్నదో ఆయనకు తెలిసివుండేది’ అని మాయ తనలో తాను అనుకున్నది. పట్టుబట్టి తన భర్తచేత స్నేహితురాలితో మాట్లాడించి అమాయకురాలైన కరుణ, తాను మాత్రమే తన భార్యను అధికంగా ప్రేమిస్తున్నాడు అన్న అహంకారంతో కుంజబాబు, పెళ్ళయిన వ్యక్తి అని తెలిసి కూడా తనవైపు ఆకర్షింపజేసుకోవాలని పంతం పట్టిన మాయ... ఈ ముగ్గురి మధ్య జరిఏ మానసిక సంఘర్షణ చివరికి ఏ పరిణామాలకు దారితీసింది?