Book Description
ఇంకా అమాయకురాలుగానే కన్పిస్తున్న ఆ బాలికను యీ వార్త ముఖం చాటుచేసుకొని మూలన కూర్చుండిపోయేటట్లు చేసింది. ఆ బాలిక హృదయం విచిత్రమైన సందేహంతో నిండిపోయింది. ఆమె రక్తనాళాల్లో అదోరకమైన భయం సంచరిస్తూ వుంది. ఏమవుతుందో? యువతుల కళ్ళల్లో వాలు చూపులుగా మారే ఉత్సాహంగానీ, అధరాలమీద తొణికిసలాడే దరహాసంగా మారి అవయవాలన్నిటినీ మందగింపజేసే ఉల్లాసంగానీ ఆమెలో కన్పించడం లేదు. ఆమె మనసులో అభిలాషలు లేవు. అక్కడ వున్నవన్నీ కేవలం అనుమానాలు, సందేహాలు. వగపుతో కూడిన తలపులూ, వెరపుతో కూడిన ఊహాలు! ఆమె యౌవనానికి ఇంకా నిండుదనం రాలేదు. ఏమిటా వార్త? ఆమె కలవరానికి కారణమేమిటి? 1960ల నాటి బాల్య వివాహాల గురించి ప్రేమచంద్ వ్రాసిన అద్భుతమైన నవల ‘నిర్మల’. తప్పక చదవండి.