Book Description
సుప్రభాతవేళ, ఆశ్వీయుజమాసం, వర్షాకాలం గడిచిపోయింది. గ్రామంలో ఏ ప్రక్కకు వెళ్ళినా కుళ్ళిపోయినా గోగు, జనుముల దుర్గంధం ముక్కోళ్ళు బ్రద్దలు కొట్టేస్తోంది. అప్పుడప్పుడు జ్యేష్ఠ మాసాన్ని తలదన్నే యెండ వేస్తోంది. ఒక్కొక్కరోజున శ్రావణమాస మబ్బులను మరపించే కారుమబ్బులు క్రమ్ముకొస్తున్నాయి. దోమలబాధ వర్ణనాతీతం. మలేరియా జర్వంలేని ఇల్లంటూ లేదు. వేపచెక్క, తిప్పతీగ వుండలు లేని గృహంలేదు. విశాల పచ్చిక బయళ్ళు నవనవలాడుతున్నాయి. కాని గడ్డి కోసుకుతెచ్చుకోటానికి ఎవ్వరికీ తీరికలేదు. ఇలాంటి రోజులలో ఒకనాడు బిందాశాస్తుర్లూ, కర్తారసింగూ ఇద్దరూ ఒక చెట్టునీడన నిల్చొని సంభాషించుకుంటున్నారు. ఇక చదవండి.