Book Description
ప్రేమ్‍చంద్ అసలు పేరు నవాబ్‍రాయ్ లేక ధనపత్‍రాయ్. ఆయన రచించిన ‘సోజేవతన్’ అనే పుస్తకాన్ని ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం నిషేధించి, కాపీలన్నిటిని తగులబెట్టింది. అందుచేత 1910 నుంచి ‘ప్రేమ్‍చంద్’ అనే కలం పేరుతో రచనలు కొనసాగించారు. ‘శివరానీదేవి’ అనే వింతతు బాలికను వివాహం చేసుకున్న గొప్ప సంస్కర్త ప్రేమ్‍చంద్. 1921లో గాంధీజీ పిలుపునందుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజలలో దేశభక్తిని, జాతీయ భావాలను ప్రేరేపించేవారు. ‘మర్యాదా’ అనే పత్రిక సంపాదకులు సంపూర్ణానంద్‍గారు జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళగా, కొంతకాలం ఆ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం కాశీవిద్యాపీఠంలో ఒక స్కూలుకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఉద్యోగరీత్యా గ్రామ గ్రామాలు, పల్లె పల్లెలు తిరుగుతూ ప్రజల జీవితాలను తరచి అనేక నవలలు, కథలు, వ్యాసాలు రచించారు. ఆయన రచనలలోని పాత్రలన్నీ సజీవమైన సామాన్య ప్రజల పాత్రలే. ప్రేమ్‍చంద్ రచనలలో మరో ఆణిముత్యం ‘సేవాసదన్’. తప్పక చదవండి.