Book Description
దాదాపు ఓ వంద సంవత్సరాలకు పూర్వం అగ్రవర్ణానికి చెందిన బల్రామ్ ముఖర్జీ తన పేరుగల మిత్రుడు బల్రామ్ ఘోషాల్ను వెంటబెట్టుకొని విక్రమ్పుర్ వైపుకు బయలుదేరి యీ కువాన్పుర్ గ్రామంలోకి వచ్చి స్థిరపడిపోయాడు. ఈ కువాన్పుర్ గ్రామంలోని ఆస్తికికూడా ఒక చరిత్ర వున్నది. ముఖర్జీ కేవలం కులీనుడు మాత్రమే కాకుండా, చతురుడు, మంచి తెలివితేటలు గలవాడు కూడా. ఆయన అక్కడ తన వివాహం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇంకా ఏమేమిటో చేసి కావలసినంత ఆస్తికూడబెట్టాడు. బల్రామ్ ఘోషాల్ కూడా ఈ విధంగానే తనపెళ్లి చేసుకొన్నాడు. కాని అతడు కేవలం తన తండ్రి అప్పులు తీర్చడంకోసం తప్ప మరేమీ సామర్థ్యం లేక ఆస్తి ఏమీ కూడబెట్టలేకపోయాడు. అంచేత కష్టాలలోనే కాలం గడుపుతూ వచ్చాడు. వివాహ సంబంధంగా కూడా మిత్రులిద్దరిలో కొంచెం మనస్పర్థలు యేర్పడ్డాయి. చివరకు రాను రాను ఆ మనస్పర్థలు పెరిగి వారిరువురి మధ్య వివాదంగా పరిణమించాయి. ఒకే గ్రామంలో వరసగా ఇరవై సంవత్సరాల నుంచి వున్నప్పటికీ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. చివరకు ఓ రోజు బల్రామ్ ముఖర్జీ మరణించాడు. ఆ రోజుకూడా ఘోషాల్ అతని ఇంట్లోకి అడుగుపెట్టలేదు. కాని అతడు మరణించిన మరుసటి రోజే ఆశ్చర్యకరమైన మాట ఒకటి వినిపించింది. బల్రామ్ ముఖర్జీ తన ఆస్తినంతటినీ సరి సమానంగా రెండు భాగాలుగా చేసి వాటిలో ఒక భాగాన్ని తన కుమారుడికీ, రెండోభాగాన్ని తన పేరుగల మిత్రుని కుమారుడికీ ఇచ్చేసి పోయాడని. ఇక చదవండి.