Book Description
కమ్మరివాని కొలిమి తిత్తి నోటిదగ్గర మండుతున్న బొగ్గులు ఎలా రగులుతూ దహనమై బూడిదైపోతాయో సరిగా అదే విధంగ ప్రజ్వలిస్తున్న విరాజ్ బహు మస్తిష్కం ముందు అద్వితీయమైన, అమూల్యమైన ఆమె హృదయం కూడా రగిలి, మండి బూడిదైపోయింది. ఆమె భర్తను మరిచిపోయింది. ధర్మాన్ని మరచిపోయింది. మరణాన్ని మరచిపోయింది. రెప్ప వాల్చకుండా ఆవలి ఒడ్డున ఉన్న రేవు వైపుకు అదే పనిగా చూస్తూ ఉంది. ఒక్కసారి ముఖం చాపి ఆమె నీటివైపు చూసింది. ఒక్కసారి మెడ త్రిప్పి ఇంటివైపు చూసింది. ఆ తరువాత గబగబా తన చేతులతో బంధనాలు విప్పుకుని రెప్పపాటులో ఆమె ఆ చీకటి వనంలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. ఎందుకు? ఆమె ఈ స్థితికి కారణమేమిటి?