Book Description
”అయినా నాకెందుకో అనిపించేది. దైవం మనకు సాయం చేస్తాడనీ, ఎప్పటికైనా మీరు నావారౌతారనీ…” అన్నది సుందరి సత్యంతో. సత్యమూర్తి ఎం.ఏ., ఫస్టుక్లాసులో పాసైనా తల్లికి వైద్యం కూడా చేయించుకోలేని దురదృష్టవంతుడు. విధి చాలా విచిత్రంగా అతన్ని ఒక సంపన్న కుటుంబంతో కలిపింది. ఆ యిల్లు పేరుకు యిల్లేగాని అక్కడ మమతలు, అనురాగాలు, ఆప్యాయతలు యేవీలేవు. తల్లిదొకదారి, తండ్రిదొకదారి, పిల్లలొకదారి. తల్లికి హంగులూ, ఆర్భాటాలూ, పార్టీలూ, పెద్దలనబడేవారితో సాంగత్యం. తండ్రి సౌమ్యుడు కావడంవల్ల మనసులోనే వేదనచెందుతూ నిస్సహాయుడై నిర్లిప్తంగా వుండిపోయాడు. విధి ఆ సంసారంతో యెన్నో ఆటలు ఆడింది. వివిధ వ్యక్తులు ఆ యిల్లాలి బలహీనతను స్వార్థానికి ఉపయోగించుకుని సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో, అకృత్యాలలో పాలుపంచుకునేలా చేశారు. ఇంత జరిగినా సత్యమూర్తి – సత్యం… శ్రీరామచంద్రుడిలాగా ఆ యింటినీ, ఇంటిలోని వ్యక్తులనూ కడుపులో పెట్టుకొని కాపాడాడు. అంతా తనవారనుకున్న తండ్రీ కూతుళ్ళకోసం. మచ్చలేని అద్భుతవ్యక్తి సత్యమూర్తి. ఒక కుటుంబాన్ని మునిగిపోకుండా రక్షించిన ధీశాలి – ఉత్తముడు. అరుదైన పాత్రచిత్రణతో, పంచవన్నెల మనోహర వర్ణచిత్రంలా సాగిన నవల ‘సత్యం శివం సుందరం’ రచనలో ఉన్నత ప్రమాణాలకోసం కలలుకనే పాఠకలోకానికి సాహిత్య ఎడారిలో ఒయాసిస్‌లాంటి అందమైన నవల – సత్యం శివం సుందరం