Book Description
‘‘వాట్ ఈజ్ ఎ మిస్ర్టస్!’’ మిస్ట్రస్ అంటే అని ప్రశ్నించింది నా సహనానికి పరీక్ష అని తలుస్తూ. ‘‘ఉంచుకోవటం... నేను నిన్ను ఉంచుకుంటాను. అంటే మనిద్దరి మధ్య ఉన్న సంబంధం చట్టబద్ధం కానిది.’’ సునీర ముఖం చూస్తే నిజంగానే అర్థం కాలేదని తెలుస్తుంది. సునీరది నిజంగా నటనే అయితే అద్భుతమైన నటనాకౌశల్యం వ్యర్థం అయిపోతుంది. నిట్టూర్చి- ‘‘ఎ వుమెన్ హూ ఇల్లీగల్లీ ఆక్యూపయింగ్ ది ప్లేస్ ఆఫ్ వైఫ్.’’ ‘‘ఆ ప్లేస్ లో ఉంటే పిల్లలు పుడతారా?’’ అని అమాయకంగా అడుగుతున్న సునీరను అప్పటికి అర్థమయింది మహమేంద్రకి తనపై ప్రేమలేదని, ముఖాన్ని చేతుల్లో దాచుకుని హృదయవిదారకంగా ఏడ్చింది. సునీర ప్రవర్తన నిజమో... అబద్ధమో తెలియని మహేంద్ర సందిగ్ధావస్థలో పడిపోయాడు. సునీరకు మంచి తప్ప చెడు తెలియదు... ఇవ్వడమేగాని తీసుకోవటం తెలియదు. తను ప్రేమించిన వ్యక్తికి ముందూ వెనుకా ఆలోచించక ఏమయినా ఇవ్వగలదు. తనను తాను అర్పించుకోగలదు. అలాంటి సునీరకు తన స్వార్థం కోసం ఉపయోగించుకోవటం ఏమాత్రం తన మనసు ఇష్టపడటం లేదు. సురేంద్ర, నవీనా, మహేంద్ర, సునీర, అందరూ కల్లాకపటం లేనివారే. అందరి హృదయాలు పవిత్రమైనవే. వారు ఒకరి కోసం ఒకరు అలమటించిపోయేవారే! మరి విధి ఆడిన వింత నాటకంలో వారు ఎలా నెగ్గుకు రాగలిగారో చిట్టారెడ్డిగారి ‘సోనీ మై సోనీ’ చదవండి!