Book Description
‘‘ఇప్పుడు టైం రాత్రి పదయింది’’ సడన్‍గా అన్నాడు సుభాష్ చంద్రబోస్. లావణ్య ఆశ్చర్యపోయింది. ‘అదేమిటి? ఉదయం పదకొండే అయింది’ అనుకుంది. అయితే అతను చెప్పిందే నిజమన్నట్లు మైథిలి ‘‘అవును! ఇప్పుడు టైం రాత్రి పదయింది’’ అంది. ‘‘నువ్వు ఇందాకే భోజనం చేయడం వల్ల నీకు నిద్ర ముంచుకొస్తోంది’’ ‘‘అవును! నాకు ని...ద్ర... ముం...చు...కొ...స్తోం...ది...!’’ నిద్రలోకి జారుకున్నవారు మాట్లాడినట్లు తడబడుతూ చెప్పింది మైథిలి. ‘‘చుట్టూ చీకటి! దట్టమైన అడవి ప్రదేశం... దూరంగా హోరుమనే జలపాతం... ఆ సమయంలో ఎవరో ఒక యువతి పరుగెడుతోంది... ఆమెని తరుముతూ...’’ ‘‘గుర్రాల మీద సైనికులు వస్తున్నారు’’ సుభాష్ చంద్రబోస్ మాటలను మధ్యలోనే తుంచి తాను చెప్పింది మైథిలి. ఆ సమయంలో ఆమె శరీరం ఎగిరెగిరి పడడం గమనించారు అక్కడున్న వారందరూ ఆమె తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతోంది. బలంగా శ్వాస తీస్తోంది. ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాము. రోషంతో ఆమె ముఖం ఎర్రబారిపోయింది. ‘‘తర్వాత ఏమైంది?’’ ప్రశ్నించాడు సుభాష్ చంద్రబోస్. ‘‘తుచ్చులు, నీచులు రుద్రభూపతి సేనలు వెంబడించడంతో ఆమె తన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి శివగంగ జలపాతంలోకి దూకి ఆత్మార్పణ చేసింది’’ రుద్రభూపతి ఎవరో, మైధిలి ఎవరో తెలియాలంటే ‘విజేత’ చదవాల్సిందే.