Book Description
‘‘నేను పరాయిదాన్నయితే నన్ను ప్రేమించడం మానేస్తారనుకొన్నాను. ఆ విధంగా నాకు దూరమైన మీరు అర్పితకు చేరువవుతారని ఆశపడ్డాను. అందుకని సంజయ్ వైపు మొగ్గు చూపాను. అతడికి చేరువ కావాలనుకొన్నకొద్దీ నా మనసు ఎదురు తిరగసాగింది. అపుడు తట్టింది... నాకు తెలీకుండా లోపల వరో వున్నారని. కొమ్మ చివర విరిసే పుష్పగుచ్ఛంలా కాకుండా ఎక్కడినుండి వస్తుందో, ఎలా వస్తుందో తెలియకుండా మనల్ని చుట్టివేస్తుందనిపించింది. మీరు జ్వరంతో దిక్కుమొక్కు లేనట్టుగా పడివున్నారని విన్నాక మనసు కట్లు త్రెంపుకొంది. వచ్చేశాను.