Book Description
‘‘ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు కార్చాల్సిన సమయమిది. కన్నె కలలూ, కన్న కలలూ అన్నీ కాలి బుగ్గి అయిపోయినందుకు కన్నీరు. పెళ్ళికి ముందు అతడెంత క్షుద్రుడో తెలిసి నన్ను నేను రక్షించుకొనే అవకాశం మిగిలి ఉన్నందున పన్నీరు’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ నవ్వింది. ‘‘ఇంకా పెద్ద నేరస్తుడినే నా ముందు నిలబెడతానన్నావు. నా తీర్పు ఏమిటో చూస్తానని ఛాలెంజ్ చేశావు. నా తీర్పు ఇదే వైజయంతీ’’ ప్రదానం రోజు విహారి తన వేలికి తొడిగిన ముత్యపు టుంగరం తీసి వైజయంతి వేలికి తొడిగింది. ‘‘నువ్వు చాలా తెలివైనదానివే. ఎలా వంచింపబడ్డావని ఆశ్చర్యంగా ఉంది.’’ ‘‘అతడు నా కంటే తెలివైనవాడు కాబట్టి.’’