Book Description
‘‘అబ్బ! ఎలా కాలిపోతోంది ఒళ్ళు! జ్వరం నిన్నటి నుంచీ తగ్గలేదా చినబాబూ?’’ కంగారుగా అడిగింది లీలావతి. ‘‘లేదు’’ అన్నాడు సతీష్. ‘‘నేను బాగున్నానా, ఈ గదిలో చస్తున్నానా అని ఒక్కరైనా ఆలోచించరు. కన్న తల్లిదండ్రుల ప్రేమనీ, అన్నాచెల్లెళ్ళ ప్రేమనీ నోచుకోలేకపోయాను.’’ అటువంటి సతీష్‍కు విధివక్రించి వాళ్ళింట్లో పనిమనిషిగా చేరిన లీలావతి అనుకోకుండా సన్నిహితమైంది. కాని.... ‘‘మిమ్మల్ని నేను ఎప్పుడూ ప్రేమించలేదు. ఆశించలేదు’’ అన్నది లీలావతి. ‘‘శోభారాణి నన్ను వంచించింది. నా మరదలు వంచించింది. చివరకు నువ్వూ వంచించావన్నమాట’’ సతీష్ ముఖం కోపంతో ఎర్రబడింది. లీలావతి ప్రేమ నటనేనా? సుప్రసిద్ధ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి కలంనుండి పరవళ్ళు తొక్కిన నవలాతరంగం పాణిగ్రహణం.