Book Description
విరించి ఓ శాపగ్రస్తుడు. కాలేజీ రోజుల్లో తన క్లాస్ మేట్ సుప్రియని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుందామనుకుంటాడు. విరించి తండ్రి సుప్రియను చేసుకుంటే కట్టుబట్టలతో బయటకెళ్ళాల్సి ఉంటుందని చెప్పి మేనకోడలు శశిని చేసుకోమంటాడు. ఆ పెళ్ళి విరించికి ఇష్టం లేకపోయినా చేసుకోక తప్పదు. శశి విరించి పాలిట విలన్ అవుతుంది. ఆ నేపథ్యంలో సుమకి దగ్గరవుతాడు విరించి. కానీ అక్కడ అతనికి మనశ్శాంతి లభించదు. జీవితంపై విసిగిపోయిన విరించికి మైత్రి స్నేహం చల్లని వెన్నెల అవుతుంది. ఎన్ని స్నేహాలు, బంధాలు, బాధ్యతలూ ఉన్నా విరించి ఆఖరికి ఒంటరిగానే మిగిలిపోతాడు. ప్రేమ కరువైన విరించి ‘ప్రేమ కావ్యం’ చదవండి