Book Description
ప్రకాష్ తండ్రిముఖంలోకి నిశితంగా చూస్తూ ‘‘ఈశ్వరిని నేను పెళ్ళి చేసుకోదలిచాను. ఈ విషయంలో మీరు సుముఖులై ఆమెను మీ కోడలిగా అంగీకరిస్తే గొడవలుండవు. మీరిష్టపడకపోతే నేను ఆగేది లేదుకూడా. ఆమెను తీసికెళ్లి ఏ గుళ్ళోనో పెళ్ళాడేస్తాను. లేకపోతే రిజిష్టరు మారేజి చేసుకొంటాను’’ అన్నాడు సూటిగా. తల్లి నిష్ఠూరంగా అంది. ‘‘ఇంతవాణ్ణి చేసినందుకు నువ్వు మాకు తెచ్చే కీర్తి యిదన్నమాట! వంశమర్యాదలు కాపాడక్కర్లేదా? వరించటానికి అందం ఒక్కటేనా కావలసింది చంద్రుడూ? ఈశ్వరి పుట్టుపూర్వోత్తరాలు ఆలోచించు ఒక్కసారి. తల్లి కులభ్రష్టమయిఎవరూ పలకరించక కుక్కచావు చచ్చింది. అనాథ అని అన్యాయమైపోతుందని ఆశ్రయమిచ్చాం ఆ పిల్లకి. పూర్వం నుంచి మన వంశం ఎలాంటిది? మన గౌరవ మర్యాదలెలాటివి? వంశ మర్యాదను మంటగలుపుకుంటామా? ఒక పతిత కూతుర్ని కోడలిగా అంగీకరించి, మచ్చలేని మన వంశానికి కళంకం తెచ్చుకుంటామా?