Book Description
‘‘ముచ్చటైన దాని సంసారం, ముత్యాల్లాంటి పిల్లలు. శంకరి అన్నట్టు నిజంగా ఒక చిన్న స్వర్గమే. ఆ స్వర్గాన్ని అన్నగా నేను కల్పించాల్సింది. సంప్రదాయం ఛాందసాలలో మునిగిన నాకు అంత మంచి ఆలోచన రాలేదు. చెల్లెలు సౌభాగ్యం కోల్పోయిందని దుఃఖపడ్డానేగాని తిరిగి ఆమెకు సౌభాగ్యం కల్పించాలనుకోలేదు. నేను గనుక కొంచెం విశాలత్వం కనబరచి వుంటే శంకరి లేచిపోవాల్సిన అగత్యం ఎందుకేర్పడేది ‘‘నేనిలా మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను’’ అని శంకరి చెబితే మనం ఒప్పుకొనే వాళ్ళమా చావగొట్టి చెవులు మూసేవాళ్ళం. మనకూ మన పిల్లలకూ చాకిరి చేస్తూ నిస్సారంగా గడిచిపోయేది దాని జీవితం.’’ - సౌభాగ్యం ‘‘మధ్య తరగతి ఆర్థిక పరిస్థితులు ఒక స్త్రీ భర్తనూ, కాపురాన్నీ వదిలేసి వస్తానంటే ఆమెకు అండగా నిలవడానికి ఒప్పుకోవమ్మా.’’ ‘‘ఐతే స్త్రీ కూడా కాపురం వదిలేసుకోవాలనుకోదు. ఎంత దుర్భరమైన బాధ అనుభవిస్తేనో ఆ నిర్ణయానికి వస్తుంది. అటువంటప్పుడు ఆమె బాధనూ, ఆమె పరిస్థితినీ మనం అర్థం చేసుకోవాలి. ముందు దాన్ని గుర్తించాల్సింది తల్లిదండ్రులు. భర్తను వదిలేసినంత మాత్రాన ఆమెను మీరు కడుపులో నిప్పుగా ఎందుకు భావించాలి ‘‘నా బిడ్డకు ఈ భర్త లేకుంటే పీడాపోయె. అది తన కాళ్ళ మీద తను నిలబడే స్తోమత, ఒంటరిగా బ్రతకగల ఆత్మ స్థయిర్యం కలిగిస్తాము’’ అని మీరు ఎందుకు అనుకోలేరు’’ - చితిలో సతి