Book Description
వేసవి సాయంత్రం. వేడి ఇంకా తగ్గలేదు. ఔట్ హౌస్ తలుపులు తెరుచుకొన్న శబ్ధానికి జగన్ అప్రయత్నంగా తలెత్తి చూశాడు. నిమిషం తరువాత ఒకమ్మాయి కర్టెన్ తప్పించి బయటికి రెండడుగులు వేసింది. జగన్ రెప్పవేయడం మరిచిపోయి చూస్తున్నాడు అప్పటికే. కొద్ది క్షణాలు- ఇద్దరి మధ్యా గాలి స్థంభించినట్టుగా, చెట్లు ఆకులు కదిలించడం మానేసినట్టుగా, పీలుస్తున్న ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆగ్రహం, అసహ్యం. జగన్ లో చెలరేగిన ప్రళయం ఆగడానికి కొద్దినిమిషాలు పట్టింది. ఆమె ఒకనాటి తన ప్రేయసి. కలలసుందరి. కలలలో కాపురం చేసిన గహిణి. ఇపుడు తన పరిసరాల్లో పరస్ర్తీగా తిరుగుతూంది. విధి ఎంత విచిత్రంగా తన జీవితాన్ని తలక్రిందులు చేసివేసింది. గతం అతని కళ్ళముందు కదలాడింది.