Book Description
అమాయకపు పల్లెపడుచు సీత పట్నంలో భర్త ఇంట బ్రతుకులో మొదటి పాఠాలు నేర్చుకొంటుంది. అన్నగారి కుటుంబానికి ఏవిధంగానూ సహాయపడలేని తన అశక్తతకి బాధపడుతుంది. హైదరాబాద్ జీవితం, సుందరి సాంగత్యం, వదినగారి అనారోగ్యం ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతాయి. ఒకనికి కూతురుగా, మరొకనికి భార్యగా, వేరొకనికి తల్లిగా ఆడదాని ఆ హోదాలు తొలగిపోతే చివరికి మిగిలే ఆమె జీవితం ఏమిటి? ఇది ఒక సీత కథ. ఒక రాజమ్మ - ఒక అనసూయ - ఒక సుందరి - ఒక శాంత - తరతరాల తెలుగు ఆడపడుచుల జీవిత కథ. పలాయన వాదానికి దూరంగా, సహజత్వానికి దగ్గరగా రాయబడిన నవల.