Book Description
1873 మే నెలలో రచయిత లియో టాల్‍స్టాయ్ ‘‘అన్నా కెరనినా’’ నవల రాయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నవలలోని పాత్రలు రచయిత మాదిరిగానే భూస్వామ్య దాస్య వ్యవస్థలో పెరిగినవి. అదే విధంగా 1870ల నాటి నూతన ‘పరివర్తనా దశ’కి చెందినవి. రష్యాలో గుర్తింపు పొందిన ఈ నవల అనేక విదేశ భాషల్లోకి అనువాదం అయింది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో ‘‘అన్నా కెరనినా’’ అనర్ఘరత్నం. కాలం మారినా నిత్యహరితంగా స్పందనాత్మకంగా వుండే మణిపూసల కోవకి చెందినది. సమున్నత లక్షణాలతో విశిష్టమై సమకాలిక వ్యాప్తి పొందిన ఎలాంటి రచనలని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అనువాదం చేసిన ‘ఆర్వియార్’గారికి ప్రత్యేక ధన్యవాదాలు.