Book Description
వంశీగారు నాకే కాదు గోదావరిని, తెలుగుని, అమ్మని, అమ్మ చేతివంటని, ఇల్లాలిని, ఇల్లాలి అలకలని, కులకులని, పిల్లాపాపలని, పాడిపంటలని, బతకనేర్చినతనాలని, బడాయి ఫోజులని, కాలవగట్లని, కన్నెపడుచుల్ని, బోళాశంకరుల్ని, బోసినవ్వుల్ని, నిష్కపట హృదయాలని, ‘నిన్న’లకు సాక్ష్యంగా నిలిచిన ప్రతీ చెట్టుని, పుట్టని... ప్రేమించే అందరికీ ఆయన దగ్గరి చుట్టం.