Book Description
వంశీగారి జన్మస్థలం పసలపూడి. ఆయన రచించిన ‘‘మా పసలపూడి కథలు’’ విశేష ఆదరణ పొంది, తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడే గౌరవం సంపాదించుకున్నాయి. కథ రాయడానికి రచయితకు ఒక్క భాషే కాకుండా దమ్మూ, నిజాయితీ, అథారిటీ, అనుభవం, తగినంత స్పందన వుంటే కానీ మంచి కథలు రావు. ఈ విషయంలో వంశీగారిది అందెవేసిన చెయ్యి. ఈ కథలను చదువుతుంటే మనం ఆ ప్రదేశంలో వున్నట్టు, మన ఎదురుగానే కథ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కథలో మనం కూడా ఇమిడిపోయి కథలోని పాత్రలు మనకు సన్నహితమైపోయాయి. తప్పక చదవండి.