Book Description
ఈ సంకలనంలో వున్న కథలు కొన్ని ఇతర సంకలనాల్లో కూడా వచ్చి వుండొచ్చు. అవి చాలా అరుదు. వీటిలో ఠాగూర్ బెంగాలీ కథకు చేసిన స్వేచ్ఛానువాదం నుంచి నాటికగా ప్రాచుర్యం పొందిన కీ।।శే।। గోపాలరాజుగారి కథా రూపకం వరకు, 1952 నాటి దొంగలున్నారు జాగ్రత్త కథ నుంచి నిన్న మొన్నటి అమ్మమ్మ చదువు వరకు, పాతకాలం కథలతో పాటు భాషాపరంగా కొత్త పోకడలు పోయిన ఈ దశాబ్దంలోని కథల వరకూ ఉన్నాయి. ఈ కథలు ఎప్పటికైనా ఏ భాషలోనివైనా ఎల్లలు లేనివి. ఎప్పటికీ ఆస్వాదించదగ్గవి. చదివి మర్చిపోలేనివి. ఈ కథల సంకలనం తేవడానికి ముఖ్య కారకులైన శ్రీవాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్డి నవీన్, పొన్నపల్లి సీతగార్లకు కృతజ్ఞతలు.