Book Description
హనుమంతరావు రాసిన నాటికల్లో చివర చెప్పదగినది ‘ఎర్రబుట్టలు’. రాఘవయ్య ఇంటికి ఒక దొంగ మంత్రశక్తి గల స్వాములవారి వేషం వేసుకుని వచ్చి, ధనాన్ని నగలను ప్రోగు చేసుకుని, అతని తాలూకు మనుషుల్ని పోలీసులుగా రప్పించి, తనను అరెస్టు చేసి తీసుకుపోతున్నట్లు నటించి అంతా దోచుకుపోతారు. అది తెలుసుకొని తన ఇంట్లో యూనిఫాం దొంగలించబడిందనీ, దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన నిజమైన సర్కిల్ ఇన్స్పెక్టర్‍ని దొంగ అని పట్టుకొని బంధిస్తారు రాఘవయ్య మనుషులు. మున్సబు వచ్చి సర్కిల్‍ని గుర్తించి విడిపిస్తాడు... పోలీసు వేషాల్తో సాగే మోసాలను నవ్వు పుట్టించే విధంగా రాసిన నాటిక ఇది.