Book Description
వాషింగ్టన్ బొడ్డులో బంగారంతో జన్మించలేదు; కేవలం బంగారుపూతతో మాత్రమే జన్మించారు. త్వరలోనే ఆయనకు పితృవియోగం సంభవించటంతో అదీ పోయింది. ఆ తరువాత ఆయన బంధుమిత్రులనుంచి దూరం చేయబడటం, అత్యంతాధికారంలో ఉన్న ఫెయిర్ ఫాక్స్ కుటుంబం నుండి విడిపోవడం కూడా జరిగినవి. పోతే ఆయన ఆశయాలు రూపురేఖలు దిద్దుకొని, మిలిటరీలో చేరటంతో ఎంతో ఎత్తుకు ఎగసినవి. కాని బ్రిటిష్ రెగ్యులర్స్లో ఆయనకు స్థానం లభించకపోవటంతో ఆయన దిగజారారు; ఆ తరువాత మంచి సంబంధం దొరికి వివాహం చేసుకున్నారు. వాషింగ్టన్ అభిరుచులు జమీందారుగారి అభిరుచుల్లో నాణ్యమైనవిగా ఉండేవి. ఆయన హాస్యాన్ని ఆస్వాదించగల సమర్థుడు. ఆయన అనుభూతులు అప్పుడప్పుడు ఎంతో లోతులకుపోయి, ఆయన కంటినుంచి నీరు తెప్పించేవి. ఆయన ధైర్యశాలి; ఐతే అడివిపిల్లి మాత్రం కాదు. ఆయనకు సరిహద్దు ప్రాంతం తెలుసు. అవసరమైన పరిస్థితుల్లో రక్షణదళంలో ఉండటంవల్ల, కలిగే లాభాలు ఆయన ఎరుగను. కాని, ఆయనమాత్రం డేవిడ్ క్రానెట్ కాదు. బ్రిటిష్వారి దృష్టిలో ఆయనొక తిరుగుబాటుదారుడు;