Book Description
యునైటెడ్ స్టేట్స్లో అమెరికన్ దంపతులకు పుట్టిన బిడ్డను, పసితనంలోనే ఫ్రాన్స్కు తీసుకొనివెళ్ళి ఫ్రెంచి కుటుంబంలో పెంచినట్లయితే - సాంకేతికంగా జాతీయ ఏమైనప్పటికీ - ఫ్రెంచి వారివలెనే ఆ బిడ్డ పెరుగుతాడు. అదేవిధంగా చైనీయుడు చిన్నతనంనుంచీ అమెరికన్ కుటుంబంలో పెంచబడినట్లయితే - అతడు వేషభాషల్లోనూ, ఊహల్లోనూ, ప్రవర్తనలోనూ అమెరికన్ వలెనే సంచరిస్తాడు; అతని ముఖంలో కనిపించే భావాలూ, ఇతర చిహ్నాలూ అతను పెరిగిన కుటుంబీకులను పోలి ఉంటూ - అతను పెరిగిన వాతావరణం, ఆహార విశేషాలూ మొదలైనవి తెగవాగిస్తూండడంలో - అతను అమెరికన్ వలెనే కనిపిస్తాడు; శరీరచ్ఛాయ, మంగోలియన్ వొంపులూ మొదలైనవి అతని కన్న తల్లిదండ్రుల పోలికల్లో ఉన్నా, అతని ధోరణీ, అలవాట్లూ, ఆచార వ్యవహారాలూ మొదలైనవి పెంచిన కుటుంబలోనుంచే వొస్తవి. అమెరికన్ సంస్క•తిని విశదీకరించటం చాలా కష్టం. ఎందుకంటే దానివేళ్లు ఎంతెంతో దూరాలనుంచి వొచ్చినవి; మూలాలకు లెక్కలేదు; సంస్క•తి పెరిగేందుకు సహాపడినవి అనేకం ఉన్నవి. దీన్ని సమన్వయమంటూ ఉన్న నాటకం అనటం కన్న, వివిధ వినోదాలతో కూడినదనటం సమంజసం. దీన్నంతను యీ విధంగా చూసేందుకు మనం ఇష్టపడతాం - అన్నిటిలోనుంచి చిన్న చిన్న భాగాలు శక్తివంతంగానూ, ప్రతిభావంతంగానూ కలుసుకొనిపొయ్యేట్లుగా విసిరివేయబడి, పరిపూర్ణమైన రూపాన్ని దాల్చింది.