Book Description
వంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టికోణం గురించి, మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతి కొద్దిమందికే తెలుసు. ఆ కొద్దిమందికి తెలిసిన లక్షణాలు ఈ కథా సంపుటం ద్వారా అందరికీ తెలిసిపోతాయి. 31 కథలు, 1 నవలిక - ఇదీ ఆకుపచ్చని జ్ఞాపకం. ఇన్ని కథలు చదివాక, మనం చూడని ప్రాంతాలు చూసినట్లు, మనకు తెలియని జీవితాలు తెలిసిపోయినట్లు, అర్థంకాని మానవ హృదయపు లోతులు అర్థమైపోయినట్లు, ఆ ప్రాంతాల జీవితాల్లో మనమూ భాగమైపోయినట్లు అనిపిస్తుంది. మనసు ఆనందంతో తేలిపోతుంది. గుండె బాధతో బరువెక్కుతుంది. ఇదీ... వంశీ కథల ప్రత్యేకత.