Book Description
స్ర్తీ...సృష్టి సర్వస్వానికి సమగ్ర నిర్వచనం. ఆమె ఆంతర్యం అంతుపట్టని మహాసాగర సదృశ్యం. ఆమె అనురాగము అమృతోపమానం. అటువంటి స్ర్తీని విలాసవస్తువుగా భావించే పురుషులున్నారు. క్రయవిక్రయాలు చేసే మహానుభావులున్నారు. ఆమె శరరాన్ని అణువణువునా చీల్చివేసే తుచ్చులున్నారు. ప్రేమను ఆరాధనను కోరుకొనే స్ర్తీని వంచిస్తే ఆమెకు వెలకు కొనుక్కునే స్థితికి దిగజారిపోతే.. ఆ తపు సమాజానిదే. అయితే ఆత్మాభిమానం గల యువతి తన కళ్ల ఎదుటే కలలు కల్లలయితే ‘అవమానిత’గా తిరగబడుతుంది. వరకట్నం వధ్యశిలపై యువతి ఆక్రోశజ్వాల పరిణామాలు..