Book Description
హేమ మరణించిన ఆనంద్ ని తదేకంగా చూస్తున్న విజయ భుజం మీద చెయి ఆనించింది.విజయ్ మనసులో ఏర్పడిన లోటు బాగానే అర్థం అవుతోంది. హేమ విజయ్ తలమీద చెయి వేసింది. ఒక్క క్షణం తర్వాత రెండు చేతులతో అతని తలని పొట్టకి ఆనించుకుంది.”హేమా! “విజయ్ దుఃఖభారంతో అన్నాడు. హేమ అతని తలని నమురుతూ తగ్గు స్వరంతో అంది.”విజయ్” ఈ జీవితం వుందే! ఇది ఎప్పుడు మనకి ఏ కానుక యిస్తుందో తెలియదు.మళ్ళీ ఎప్పుడు హఠాత్తుగా మననుంచి మనకి ప్రియమైనది ఏది మననుంచి తీసుకుంటుందో తెలియదు. ఆ అదృశ్య మహాశక్తి ముందు తలవంచటమే మనకర్తవ్యం!