Book Description
ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణం, మనసులో ఏమూలో చిన్న ఆలోచన. మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నాం అని అందరికీకాకపోయినా కొందరికి అనిపిస్తుంది. ఆ కొందరిలో ఒక్కరు మాత్రమే నిస్వార్ధంగా ముందడుగు వేస్తారు. ఆ ఒక్కడే ధీరజ్. మంచిపని ఒకరైనా చేయగలరు. కాని చెడుని నిర్మూలించడానికి పదిమంది కావాలి. నవ సమాజం ఏర్పడడానికి నిజాయితీపరులైన ఉడుకు రక్తం గల యువత కావాలి. అలాంటివాళ్లు కావాలంటే ఇంటి నిర్మాణానికి గట్టి పునాదులు ఎంత అవసరమో అలాగే చిన్నతనం నుండి మానవతా విలువలు తెలుసుకుంటూ పెరిగే యువత కావాలి. అలాంటి యువత కోసమే అనాధ పిల్లలను దత్తత తీసుకొని స్పందన హోమ్ స్టార్ట్ చేసాడు ధీరజ్. అనుకోని పరిస్థితుల్లో ప్రియాంక, రాఘవ, స్నేహ, సింధూర కనబడడంతో వాళ్లకు జరిగిన అన్యాయం తెలుసుకొని చలించి పోయాడు ధీరజ్. వాళ్లందరికి న్యాయం జరిగేవరకు పోరాడాడు. కొందరికి అభిమానిగా, కొందరికి దేవుడిలా, కొందరికి ప్రేమ- అనురాగాలు పంచే కొడుకుగా, కొందరికి రక్తసంబంధాన్ని మరిపించే ఆప్తుడిగా, కొందరికి అల్లుడనేవాడు ఇలాగుండాలి అనుకొనేలా ధీరజ్ ఏం చేశాడు? నవ సమాజ నిర్మాణం జరగాలని ఆశపడుతున్న ధీరజ్ ఆశయం నెరవేరుతుందా?