Book Description
కలకత్తా ఎయిర్పోర్ట్లో దిగగానే హైద్రాబాదు విమానానికి చాలా టైమ్ పడ్తుందని చెప్పారు. మేము సిక్కిం నుంచి ఎల్.టి.సి. ట్రిప్ ముగించుకొని హైద్రాబాదు తిరుగుప్రయాణంలో వున్నాం. సిక్కింలో గవర్నర్ రామారావుగారు చాలా ఆప్యాయంగా నన్నూ, నా శ్రీమతిని ఆదరించారు. వారి శ్రీమతి సరేసరి! గవర్నర్ బంగళాలోనే మాకు వసతి కల్పించటమే గాకుండా, చుట్టుప్రక్కల తిరిగి రావటానికి గూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. గవర్నమెంట్ సర్వీసులో అదే నా చివరి ఎల్.టి.సి. ట్రిప్. నాలుగురోజుల్లో నా ఉద్యోగ జీవితం సమాప్తి దశకు వచ్చింది. సమాజానికి కాస్త సేవ చేద్దామన్న ఒక రిటైర్డ్ పోలీసు ఆఫీసరు ఉద్దేశ్యాన్ని కొందరు ఎలా అపార్థం చేసుకున్నారన్న ప్రారంభం నుంచీ, రాజకీయ వైకుంఠపాళీలో నేర్చుకోవలసిన పాఠాలవరకూ వ్రాసిన ఈ పుస్తకం, రాజకీయాల్లో చేరాలనుకునేవారికి ఒక పాఠ్యాంశంగా చరిత్రలో నిలచిపోతుంది. ఈ పుస్తకంలో మరొక గొప్పతనం - పాజిటివ్.