Book Description
“ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?” “ఎందుకు లేదు? సుందరేకాదు ఏ ఆడపిల్లయినా,నాలో ఏం చూసి నాకు చేరువ అవుతుంది? ఈ జ్ఞానం నాకెందుకు లేకపోయింది!” అతని ముఖంలో గాయపడిన అబిమానం స్పష్టంగా కన్పిస్తుంది. “ఇందులో నాక్కూడా భాగం వుంది కాబట్టి నేను చెప్పాను.నిన్ను చూస్తుంటే నేను చేసింది మంచిపని అని అన్పించటం లేదు.”… కవిత బలవంతంగా అతని చెయ్యిపట్టుకుని,ఉంగరం తొడగబోయింది. “క్షమించు కవితా!”అతను చెయ్యి వదిలించుకున్నాడు. “నిజం చెప్పినందుకా నాకీ శిక్ష?” “అదేం మాట?” “ఆత్మీయతతో ,స్నేహపూర్వకంగా ఇచ్చిన దానిని ఎందుకు తిరస్కరిస్తున్నావు మరి?”"ఆత్మీయత,స్నేహం- ఆరెండూ పొందే అర్హత,అదృష్టం నాకు లేవు కవితా!?”