Book Description
చన:- రాజీవ్ మల్హోత్రా, అరవిందన్ నీలకందన్ \nసంక్షిప్తీకరణ, తెలుగు సేత :డా. ఏ.వి. పద్మాకర్ రెడ్డి , డా. కాకాని చక్రపాణి, డా. దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి \n \nకొన్ని దేశాలలో రాయబార కార్యాలయాల్లో పనిచేసిన కాలంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇటువంటి కార్యకలాపాలు నా దృష్టికి వచ్చాయి. కాని ఈ పుస్తకం వెల్లడిస్తున్న సమాచారం కాని, దాన్ని స్పష్టంగా వ్యాఖ్యానించడానికి ఆవశ్యకమైన వ్యక్తీకరణ కాని నా వద్ద లేవు. \n- కన్వల్ సిబాల్, భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ శాఖా కార్యదర్శి. \n \n'ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. భారత వ్యతిరేక శక్తులు రాజకీయ, ఇంకా ముఖ్యంగా మేధాస్థాయిలో ఎలా తమ పట్టు బిగించాయో భారతదేశాన్ని గురించి అధ్యయనం చేయడమే వృత్తిగా కలవారు కూడా గుర్తించని సమస్యను ఈ పుస్తకం స్పష్టంగా మన ముందు పెడుతుంది. ఎడ్వర్డ్ సయీద్ పుస్తకం ముస్లిం ప్రపంచం విషయంలో చేసిన పనినే ఈ పుస్తకం భారతదేశ విషయంలో చేసింది. అయితే భారత దేశాన్ని పరిశీలిస్తున్న ప్రముఖులు ఈ పుస్తకం చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకం వాళ్ల నిర్వాకాలనే బయటపెడుతుంది'. \n- కోన్రాడ్ ఎల్ట్స్, బెల్జియన్ విద్వాంసుడు