Book Description
అది సినిమా సముద్రం. నెడితే పడ్డాడా, తానే దూకాడా బండ కొట్టుకుంది. యింటికి వెళ్లలేడు, యిక్కడ వుండలేడు అయినా సరే వుండాల్సిందే. సంకల్పాన్ని వెనక్కు నెట్టిపడేసే అనుభవాలు. లక్ష్యంపై దృష్టి సడలకుండా గమ్యం చేరుకోవాలి. అదొక్కటే తనకు చుక్కాని. స్టేజిమీద పదిహేడు బెస్ట్ కమెడియన్ అవార్డులు దర్శకత్వంలో మెపు పొందిన తెలివి వేలపాటలు పాడిన గొంతు, అక్కినేనికి ఏకలవ్యుడు. అయితే ఏంటి.... అన్నది విధి. యాదృచ్ఛికంగా ‘బ్రేక్’ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు పదహారేళ్ళ నిరీక్షణతో అన్నేళ్ళు ఎలా వుండగలిగాడు. సారధి - సారధి ఎలా అయ్యాడు. సినిమాతో తనకు వచ్చిందేంటి సినిమాకు తను యిచ్చిందేంటి.