Book Description
‘భగవద్గీత’లో కథలేదు. ఎలాంటి సంఘటనలు లేవు. అయినా కొన్ని వేల సంవత్సరాల నుండి ఎందరో మతాచార్యులకు, మహాత్ములకు, మేథావులకు, మార్గదర్శి అయ్యింది. గీతామృతాన్ని సేవించినవారికి జీవితంలో ఆత్మవిశావసం, సాహసం, సమత, సరళస్వభావం. స్నేహం, శాంతి, ధర్మం వంటి దైవగుణాలు వాటంతట అవే పెంపొందుతాయి. అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. తద్వరా వారికి, సమాజానికి ఎంతో మంచి జరుగుతుంది. రేపటి పౌరులైన నేటి బాలబాలికలకు ‘భగవద్గీత‘లోని కొన్ని అంశాలను పరిచయం చేసే చిన్న ప్రయత్నమే ‘‘భగవద్గీత బాలల కోసం’’.