Book Description
ఈ గ్రంధరచయిత శ్రీమూర్తిగారు, నేటి యువతరం వారి బాధ్యతలను గుర్తెరిగేలా ఈ పుస్తకంలో వివరించడం ఎంతగానో ముదావహం. మనదేశంలో అనితరసాధ్యంగా ఎంతగానో కృషిచేసి, ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న భారతీయ గణిత శాస్త్రజ్ఞుల గురించి అందరికి, సమగ్రంగా తెలియజేయాలనే సద్దుదేశంతో, వందమంది గణితమేధావులను గురించి, వారి వారి ప్రతిభా పాటవాలను సమున్నతంగా ఈ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఈ విశ్లేషణాత్మక పక్రియలో, గణితశాస్త్రాజ్ఞుల గురించిన సమగ్ర సమాచారం కోసం, ఎన్నెన్నో ఉన్నత గ్రంథాలను పరిశీలించి, ఇందుకుగాను, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, విలువైన సమాచారం సేకరించడం జరిగింది. అనిర్వచనీయమైన మరొక ముఖ్యాంశం ఏమంటే, తను సేకరించిన విషయంపరంపరను, సుకుమారంగా సరళమైన తెలుగులోనే, ఆద్యంతం రసస్ఫూర్తిని మేళవించి, అత్యంతాసక్తికరంగా, పాఠకులు చదువుకొనేరీతిలో, ఈ గ్రంథకర్త రాయడం, ఎంతగానో అభినందించదగిన విషయం అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.