Book Description
శ్రీమన్నారాయణుడు వైష్ణవ మతంనకు నాయకుడు. మహాలక్ష్మి, భూమాతలు ముఖ్య నాయకీమణులు. వీరిని శ్రీదేవి, భూదేవిగా పిలుస్తారు. మహోవిష్ణువును ద్రావిడులు ‘‘పెరుమాళ్’’గాను మరియు మహాలక్ష్మిని ‘‘పెరియపిరాటి’’ లేదా ‘‘తాయారు’’గాను, భూమాదేవిని ‘‘భూపిరాటి’’గా ఆరాధించుతారు. శ్రీహరి నివాసం వైకుంఠం. దీనిని భక్తులు ‘‘పరమపదం’’గా సేవించుతారు. విష్ణుసేవకులు నిరంతరం హరి ధ్యానం నందు నిమగ్నులై కైవల్యాన్ని పొందిన పిమ్మట పరమపదంను చేరుతారు. ద్రావిడ ప్రాంతము నందు విష్ణుసేవకులుగా ప్రధమ స్థానం పొందినవారు పన్నెండుమంది ఆళ్వార్లు. భూమిమీద గల 106 దివ్యదేశాలలో ‘‘సాలగ్రామ్’’ దివ్యదేశం, భారతదేశంనకు పొరుగున గల నేపాల్ భూభాగంలో ఉంది. మిగిలిన 105 దివ్యదేశాలు భారతదేశంలోనే ఉన్నాయి. వీటిలో 8 దివ్యదేశాలు ఉత్తర భారతదేశం నందు దర్శించగలము. మిగిలిన 97 దివ్యదేశాలు దక్షిణ భారతదేశంలో కలవు. ఆంధప్రదేశ్ నందు 2 దివ్య దేశాలు, కేరళ రాష్ట్రంనందు 11 దివ్యదేశాలు, తమిళనాడు నందు 84 దివ్యదేశాలు ఉన్నాయి. హైందవ సంపదలో ఒక భాగం దేవాలయాలు. మన పూర్వీకులు అద్భుతమైన దేవాలయాలను ప్రయోగాత్మక రీతిలో నిర్మించినారు. వారి శిల్ప నైపుణ్యం, శిల్ప సంపద చరిత్రలో శాశ్వతంగా నిల్చినాయి. ఇవి భారతీయుల ఖ్యాతిని ప్రపంచ నలుదిశలకు వ్యాపింపజేశాయి. ఖండ ఖండాంతరాల నుంచి కళారాధకులను ఆకర్షించి, తమ వైభవాన్ని చాటుకున్నాయి. ముఖ్యముగా దక్షిణాది ప్రాంతము యొక్క ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ సంస్క•తికి అద్దం పడతాయి. వైష్ణవాన్ని ఆరాధించిన ఆళ్వార్లు పెక్కువైష్ణవ ఆలయాలను సందర్శించి, మంగళా శాసనములు గావించినారు. అటువంటి ఆలయాలు భూమి మీద 106 వరకు ఉన్నాయి. ఇవి దివ్యదేశాలుగా ఖ్యాతి పొందినాయి. వీటిని కొంతమంది దివ్య తిరుపతులుగా కొలుస్తారు. వీటి సమాచారం క్లుప్తంగాను, భారతయాత్రా సమాచారం సమగ్రంగాను పొందుపర్చుట జరిగింది.