Book Description
కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సమకాలీన ఆధ్యాత్మిక నాయకుల్లో అగ్రగణ్యులు. కంచి కామకోటి పీఠాధిపతిగా పీఠానికి అపార గౌరవ మర్యాదలను సంపాదించి పెట్టినవారు. పీఠాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలో వేద సంస్కృతీ పరిరక్షణలో మొదటి వరుసలో నిలబెట్టినవారు. మహావిద్వాంసులు. వక్త. కొందరు అవమానాన్ని భరించలేక యుద్ధరంగంలోనే ప్రాణాలు విడిచి పెట్టేవారుంటారు. అట్టి 'అభిమాన ధనులు' జయించడంగాని, లేదా వీరమరణం గాని కోరుకుంటారు. ఇక కొంతమంది ఓడిపోయి అరణ్యాలలో తలదాచుకున్నవారూ ఉంటారు. దాగుకొన్నంత మాత్రంచే వారికి పరాక్రమం లేదని భావించకూడదు. మృగాలపై లంఘించే పెద్ద పులి కూడా ఒక్కొక్కప్పుడు నక్కియుంటుంది కదా. అట్టి పరిస్థితే వారిది కూడా. వారు సమయానికై వేచి యుంటారు. మహమ్మదీయ ప్రభువులు దండయాత్రలను చేసే సందర్భంలో ఎందరో రాజపుత్రులు వారినెదుర్కొన్నారు. కొందరు కాలానికై వేచి యుండి అరణ్యాలలో దాగినవారూ ఉన్నారు.