Book Description
సృష్టిలో ప్రతీదీ మందే. మనకి ఓపిక తీరిక ఉండి పరిశీలిస్తే. ప్రతీ మొక్కలోనూ ఔషధ గుణాలుంటాయి. ప్రతీ ఔషధం ఏదోక వ్యాధికి పనికొస్తుంది. అది అల్లోపతీ వైద్యంలోనైనా, ఆయుర్వేదంలోనైనా, నేచురోపతీ అయినా, హోమియోపతీ అయినా అన్ని వైద్యశాస్త్రాలల్లోనూ, మొక్కల్లో ఉండే ఔషధ గుణాన్ని గుర్తించి వాటిని ఉపయోగించడం ఎప్పట్నుంచో ఉంది. ఈ వైద్య శాస్త్రాలు పురుడు పోసుకోకముందే వనజీవితం గడిపే జాతులవాళ్ళు మొక్కల్లోని మందును ముందు గుర్తించారు. సృష్టి మనకిచ్చిన ఈ అమూల్యమైన, అనంతమైన సిరిసంపదని ఏ శాస్త్రం పేరుతోనైనా ముందుగా వాడటం మనిషి అలవరుచుకున్నాడు. తర్వాతే దానికి శాస్త్రం అనే సొబగులు అద్దాడు.