Book Description
రష్యన్ మహారచయిత లియో టాల్‍స్టాయ్‍కి పిల్లలంటే మక్కువ. తన ఎస్టేట్‍లోని భూస్వామ్యదారుల పిల్లల కోసం చాలా కథలు రాశాడు. ఇందులో గ్రీకు, రోమన్ ఐతిహాసిక గాథల్ని ఈసఫ్ నీతి కథలని పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకంలో అన్నిరకాల పాత్రలు వున్నాయి. మానవులు, దేవతలు, జంతువులు వంటివి. కాని పాత్రలు యెలాంటివైనా వాటి ద్వారా రచయిత పిల్లలతో మాట్లాడటం జరిగింది. అందుకే ఈ పాత్రలు మిలమిల మెరిసే శైశవ నేత్రాల్లా కనిపిస్తాయి. చిత్రకారుడు మిఖయీల్ రొమాదిన్ బొమ్మలు ఈ పుస్తకంలో అద్భుతమైన ఆకర్షణ.