Book Description
‘‘ఇన్ని ఘోరాలు కళ్ళముందే జరిగిపోయినా నేనేమీ చేయలేకపోయాను. నా దగ్గర డబ్బులేదు, నాకు చదువురాదు, ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? అదే నా ఆలోచన. జరిగిన సంఘటనలతో ఊరివారికి మొహం చూపించలేకే ఆ ఊరు వదిలి వచ్చేశాను. ఎన్నో అవతారాలు ఎత్తాక, ఎన్నో కష్టాలు పడ్డాక నా జీవితం మలుపు తిరిగింది. ‘‘సినిమాల్లో అవకాశం వచ్చింది. ఒకదాని తరువాత మరొకటి. అంతవరకూ దూరంగా వుంటూ ఊరించిన డబ్బు నా పాదాక్రాంతం అయింది. నన్ను చిల్లిగవ్వలా విసిరేసిన జనం నాకు వంగి సలాములు చేయటం ప్రారంభించారు. అదివరకు నేను మరొకరిముందు వేడుకునేవాడిని. ఆ తరువాత వారే నా యింటిముందు పడిగాపులు పడడం మొదలైంది. అదంతా చూసి ఎంతో గర్వపడిపోయాను. అనుభవించాలి, ప్రపంచంలోని అన్ని సుఖాలూ అనుభవించేయాలి. అదే నా ధ్యేయం. అదొక్కటే నా ఏకైక లక్ష్యం. అదే ధోరణిలో ఎన్నో సంవత్సరాలు గడిపేశాను. ‘‘మీతో పరిచయమయిన తరువాత మళ్లీ గతం గుర్తువచ్చింది. జీవితం యేమిటో తెలిసివచ్చింది. అర్థంలేని పరుగులు మానేసి ప్రశాంతంగా కాలం గడపటం అలవాటు చేసుకున్నాను’’ చెప్పాడు మధు. ఇప్పుడైనా మధుకి జీవితం ‘ఇంద్రధనుస్సు’ అయిందా? ఈ నవల చదివి తెలుసుకోండి