Book Description
ఉద్యమం ఆరంభం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు నేను గట్టి సమర్థకుడిని. సమర్థకుడిగా ఉండి ఉద్యమగమనం పై వ్యాఖ్యానించడం సులువు కాదు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రంలోని రెండుప్రాంతాలలో వేరువేరు అభిప్రాయాలు బలంగా ఉన్నప్పుడు, తెలుగువారందరికీ సంబంధించిన పత్రికలో సంపాదకుడిగా ఉంటూ నిష్పాక్షికమైన వ్యాఖ్యానం చేయడం కత్తిమీద సాము వంటిది. రాష్ట్రవిభజన జరగాలా, వద్దా అనే అంశంలో నేను నిష్పక్షపాతంగా ఉండాలనుకోలేదు. కానీ, ఆ విషయం మీద జరుగుతున్న విరుద్ధ భావాల ఘర్షనను, వివిధ పక్షాలకు ప్రమేయం ఉన్న పరిణామాలను పరిశీలించేటప్పుడు, ఇష్టాయిష్టాలు నా వ్యాఖ్యలను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలన్నదొక్కటే నేను నిష్పాక్షికతకు ఇచ్చుకున్న నిర్వచనం.