Book Description
అడుగడుగునా, ముందేమి జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తూ, అందమైన కథ చెప్పడంలో రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ సిద్ధహస్తుడు. దానికి ఈ ‘‘కాంచనద్వీపం’’ (ట్రెజర్ ఐలెండ్) నవలే నిదర్శనం. ఇందులో కథానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై, కాంచన ద్వీప యాత్రలో, ఓడ దొంగల మధ్య చిక్కుకుని, అతడు చేసిన సాహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళీ చదివాలనే వుంటుంది. మళ్ళీ మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఏయే సాహసాలు చేయాలని పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే ఎంత బాగుండుననిపిస్తుంది. ఈ నవలానువాదం మొదట 1951-52 ప్రాంతాలలో ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో సీరియల్గాను, ఆ తర్వాత పలుసార్లు పుస్తకరూపంలోను వెలువడినప్పుడు ఆనాటి పాఠకులను ఉర్రూతలూగించింది. మళ్ళీ ఈ తరం పాఠకులకు దీన్ని అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము.