Book Description
ఆ క్లాసులో వున్న సంపన్నుల బిడ్డల్లో అతడొకడు. మంచి ఆటగాడు, మహాయుక్తిపరుడు. హాజరు పలికి అదృశ్యమయ్యాడంటే ఇక ఆ సాయంత్రమే కన్పించేది. ప్రతినెలా ఫీజుకు రెట్టింపు జుల్మానా చెల్లిస్తుంటాడు. ఎర్రగా, పొడవుగా వుంటాడు. ఎంతో చురుకైనవాడు. ఆటలుంటే ఆకలికూడా గుర్తుకు రాదు. అతడి పేరు మొహమ్మద్ సలీమ్. అమర్‍కాంత్ నల్లగా, బక్కపలచగా వుండే కుర్రవాడు. ఇరవయ్యేళ్ళొచ్చినా ఇంకా అతనికి ••ండపుష్టి లేదు. పధ్నాలుగు, పదిహేనేళ్ల బాలుడులా కన్పిస్తున్నాడు. ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళు లేరనే నిరాశతో కూడిన వేదన అతని వదనంలో స్థిరపడిపోయింది. అతని ముఖంలోనుంచి పాండిత్య ప్రతిభ ఉట్టిపడుతూ వుంటుంది. అంచేత అతణ్ణి ఒకసారి చూస్తే మళ్లీ మరచిపోవడం కష్టం. వీరిరువురూ మంచి స్నేహితులు. దినపత్రికలు చదువుతూ వుండడం చేత రాజకీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ వుండేది. అమాయకులైన ప్రజలపట్ల ఆంగ్ల ప్రభుత్వాధికారులు జరుపుతున్న అత్యాచారాలు చూసి వారి రక్తం ఉడుకెత్తుతూ ఉండేది. భారతదేశం బానిసదేశంగా వుండటం కారణాన తెల్లవాళ్ళు ఎన్ని అత్యాచారాలు జరిపినా, అన్యాయం చేసినా యెవరూ నోరెత్తరని వారికి తెలుసు. ఈ భయాన్ని పారద్రోలాలంటే ఏం చేయాలి? ఈ బానిస సంకెళ్ళను ఎలా త్రెంచివేయాలి? దీనికోసం ఆ స్నేహితులిరువురూ ఏం చేశారు? చదవండి.