Book Description
‘‘నువ్వు నాహృదయానికి రాజువి. నా జీవితం నాశనం చేసిన రాక్షసుడివి. అప్పుడు నిన్నెలా ప్రేమించానో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను?’’ అన్నది కుసుమ. ప్రవీణ్ పువ్వు పువ్వుమీది వ్రాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెదలాంటివాడు. అతనికి వైవాహిక జీవితం, గృహ జీవితం గిట్టవు. కుసుమ అతని వల్ల మోసపోయిపిల్లవాణ్ణి కన్నతల్లి. కడుపున పుట్టిన పిల్లవాణ్ని తవ్మడుగా చెలామణీ చేస్తూ వుంది. కాని ఆమె అభిమానమే ఆమెకు కవచమైంది. ప్రవీణ్ కుసుమ వ్యక్తిత్వానికి ముగ్ధుడై తన పాత పాపపు జీవితానికి పశ్చాత్తాపపడి ఆమె క్షమ నర్థించిన రోజున కూడా ఆమె అదేవిధంగా ప్రకాశించింది. ఉత్తమ వ్యక్తిత్వం గల పాత్రల పోషణతో అపురూపమనిపించే శైలీసౌభాగ్యంతో హృదయాలనలరించే ‘‘మలిపొద్దు రేఖ.’’